మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శనం పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మంత్రి సురేఖమ్మ చేసిన కృషి ఎంతో విశేషమని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర కీలకమని అన్నారు.

ప్రస్తుతం యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న నేపథ్యంలో, భారతీయ సాంప్రదాయాలు, సనాతన ధర్మం వైపు మళ్లించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు.

భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మంత్రి కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, కుటుంబాలు ఆనందంగా జీవించాలని వేముల మహేందర్ గౌడ్ దంపతులు ప్రార్థించినట్లు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...