e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం..

మన భారత్, తాంసి, మన భారత్ , అక్టోబర్ 17:

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తాంసి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు.

శిబిరంలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్. నవీన్ రెడ్డి, బోన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ రెడ్డి పాల్గొని సేవలు అందించారు. చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో పాటు ఎముకలు, కీళ్ల సమస్యలపై వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ రజనీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు అలకట్ల విలాస్, అ లాలి అశోక్, గోపిడి నారాయణరెడ్డి, గంగారెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామస్థుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సమీపంలోనే అందే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE