e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

Rims లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వైద్యారోగ్య శాఖ, రిమ్స్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వైద్యారోగ్య శాఖ, రిమ్స్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 16, ఆదిలాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వసతి గృహం, జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో పాటు రిమ్స్ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చిత్రు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, ఇతర అధికారులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యాలయాలు, విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉద్యోగులు, విద్యార్థినుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ కళాశాల విద్యార్థినులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE