జనగణన 2027 శిక్షణ ముగింపు..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

జనగణన 2027 నిర్వహణలో భాగంగా నారాయణపేట గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన మూడవ విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం నేడు విజయవంతంగా పూర్తైంది.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్లు లక్మయ్య, నర్సప్ప, విశ్వనాథ్ రెడ్డి పాల్గొని శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమగ్రత అత్యంత ముఖ్యమని వారు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులుచెప్పిన సూచనల ప్రకారం, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు వారికి కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ (HLB) పరిధిలో సరైన సమాచారం సేకరించి మొదటి దశలో ఇండ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సేకరించిన సమాచారం పూర్తి గోప్యతతో నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

అలాగే ఉపాధ్యాయులు సహా సంబంధిత సిబ్బంది అందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆకాంక్షించారు.

జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర డేటా లభించి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీఆర్ఎస్ బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరికలు

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ నాయకులు మన భారత్,జూలై 20 తలమడుగు: బోథ్ నియోజకవర్గ...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక మన భారత్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన...

జిల్లాకు వర్ష హెచ్చరిక..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం...

మూడు నెలల రేషన్ బియ్యం .!

ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.. లబ్ధిదారులకు కీలక సమాచారం మన భారత్, హైదరాబాద్: ప్రస్తుతం ఎల్‌నినో...

More like this