e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

నవాబుపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మన భారత్ : చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు చిట్యాల పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న పర్లపల్లి అశోక్, పర్లపల్లి రాజు, కల్వల సురేష్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన చిలుముల రాజు, ఈసంపల్లి రాములు, కలికోట సాంబయ్య, పర్లపల్లి సాంబయ్య అనే మరో నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.

పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి పేకాట ఆడేందుకు ఉపయోగించిన ప్లేయింగ్ కార్డులతో పాటు నగదు రూ.800/- స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు చేపట్టడం జరిగింది.

ప్రజలకు విజ్ఞప్తి: గ్రామాల్లో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE