సైబర్ నేరాలపై కలెక్టర్ రాజర్షి షా సూచనలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

బుధవారం టీటీడీసీలో నిర్వహించిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు గురవుతుండటం ఆందోళనకరమని అన్నారు.

అనుమానాస్పద లింకులు, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టం చేశారు. సైబర్ నేరాల నుంచి రక్షణకు అవగాహన ఎంతో ముఖ్యమని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలను వినియోగించే సమయంలో అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలను నివారించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ అవగాహన సదస్సులో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this