e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

కార్యకర్తలకు ముందస్తు సమాచారం..!

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి పర్యటన వివరాలు

మన భారత్, ఆదిలాబాద్:

బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి (ఆదివారం, తేదీ: 18-01-2026) పర్యటన వివరాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కే.ఏ.కే వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 09.30 గంటలకు నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించనున్నారు. అక్కడ స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలుసుకుని సమస్యలను తెలుసుకోనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 01.00 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని, సోదరభావాన్ని చాటేలా సందేశం ఇవ్వనున్నారు.

తదుపరి మధ్యాహ్నం 03.30 గంటలకు బోథ్ మండలంలోని కౌట ‘బి’ గ్రామంలో నిర్వహించిన గంగేశ్వర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కాప్సె అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE