e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ప్రతి సోమవారం మండల స్థాయిలో సీఎం ప్రజావాణి..

జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

మన భారత్ ఆదిలాబాద్: జిల్లాలో వికేంద్రీకృత ప్రజావాణి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతి సోమవారం మండల స్థాయిలో సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించినట్లు ఎంపీడీవో మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన వికేంద్రీకృత ప్రజావాణి సమావేశానికి కొనసాగింపుగా, 19-01-2026 నుంచి అన్ని మండలాల MPDO కార్యాలయాల్లో ప్రజావాణి తప్పనిసరిగా నిర్వహించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్, MPDO, MAO, RWS శాఖకు చెందిన AEE లేదా DEE, TGNPDCL శాఖకు చెందిన AEE లేదా DEEలు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులను IFCలలోని ఆపరేటర్ల ద్వారా ఆదిలాబాద్ పైలట్ మాడ్యూల్ లేదా CPGrams మాడ్యూల్‌లో డిజిటలైజ్ చేయాలని, ఫిర్యాదుదారులకు తగిన ప్రింటెడ్ రసీదులు అందించాలని ఆదేశించారు.

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పౌర సమాజ సంస్థల సహకారం తీసుకోవాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ప్రజావాణి నిర్వహించే స్థలం MPDO కార్యాలయమేనని స్పష్టంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.

ప్రజావాణి రోజున MPDO కార్యాలయం ఎదుట ‘CM Prajavani’ అనే శీర్షికతో బ్యానర్ లేదా ఫ్లెక్స్ ఏర్పాటు చేసి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా, మండల స్థాయి ప్రజావాణిని కలెక్టరేట్ నుంచి అందించే లింక్ ద్వారా జిల్లా స్థాయి ప్రజావాణితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమం అమలులో ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే శ్రీ బండి రవి (EDM)ను సంప్రదించవచ్చని లేదా నేరుగా జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.
అయితే, ఈ ఆదేశాలు ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాలు మరియు కొత్తగా ఏర్పడిన బోరజ్, సోనాల, సత్నాల మండలాలకు వర్తించవని స్పష్టం చేశారు.

ప్రతి సోమవారం జరిగే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని MPDO మోహన్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE