e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటి పెళ్లి రాజు

నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి – తాటిపెల్లి రాజు

మన భారత్, కరీంనగర్: ప్రజాస్వామ్య పరిరక్షణ, అరాచకవాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, మాజీ జెడ్పీటీసీ తాటిపెల్లి రాజు పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ లక్ష్యంతో నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందన్నారు. జాతీయ స్థాయి నాయకుడి రాకను పురస్కరించుకుని కరీంనగర్‌లో భారీగా స్వాగత ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. నాయకులు, యువత, మహిళలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పాదయాత్రలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ మహా పాదయాత్ర నవంబర్ 23, 2026న మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లోని వైశ్య భవన్ నుంచి ప్రారంభమై టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు కొనసాగనుంది. పాదయాత్రకు సంబంధించి పార్టీ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని తాటిపెల్లి రాజు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నితిన్ నబీన్ మహా పాదయాత్రను ఒక రాజకీయ కార్యక్రమంగానే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన ప్రజా చైతన్య కార్యక్రమంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE