e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు భరోసా..సాజిద్ ఖాన్

ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు భరోసా
శాంతినగర్ కాలనీలో పథకంపై అవగాహన కార్యక్రమం.. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 22, ప్రజల సంక్షేమం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ, 35వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, కుటుంబాలకు కలిగే ఆర్థిక భద్రత గురించి వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బీమా సొమ్ము కుటుంబానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి పథకాలు ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం వివరాలను తెలుసుకొని ప్రయోజనం పొందేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు చేరే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జాఫర్, 35వ వార్డు అధ్యక్షుడు వసీం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముంతాజ్ ఖల్లా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE