e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలి జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. కలెక్టర్ రాజర్షి షా

ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలి
జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. భావితరాలకు నీటి సంపదను అందించాలి
ఆరోగ్య జాతరలో భాగంగా జిల్లాలోని 234 పాఠశాలల్లో విద్యార్థులతో జల సంరక్షణ ప్రతిజ్ఞ
విద్యార్థులు నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 22: నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని, ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వృథాను అరికట్టాలని, భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి పొదుపును తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య జాతరలో భాగంగా నవంబర్ 21న జిల్లావ్యాప్తంగా 234 పాఠశాలల్లో విద్యార్థులతో జల సంరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 102 ప్రాథమికోన్నత పాఠశాలలు, 18 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), 6 మోడల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నీటి వనరులను కాపాడుతూ, నీటిని పొదుపుగా వినియోగిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నీటిని అవసరమైన మేరకే వినియోగిస్తామని, కుళాయిలను అనవసరంగా తెరిచి ఉంచబోమని, ఎక్కడైనా నీటి లీకేజీలు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించడం, భూగర్భ జలాల పెంపునకు సహకరించడం వంటి చర్యలపై అవగాహన కల్పించారు.

జల సంరక్షణ ప్రాధాన్యతను విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలకు వివరించాలని సూచించారు. పాఠశాలల్లో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో నీటి పొదుపు పట్ల బాధ్యతాయుతమైన ఆలోచన పెంపొందుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య జాతరలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు నీటి విలువ, దాని సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడంలో ఉపయోగపడింది.

పెరుగుతున్న జనాభా, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి వృథా నివారణకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో నీటి పొదుపు అలవాట్లు పాటించడంతో పాటు సమాజంలోనూ జల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

‘నీటిని సంరక్షిద్దాం – జీవాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, నేటి నీటి పొదుపే రేపటి తరాలకు భరోసా అవుతుందని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE