బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి….

Published on

-Advertisement-

ఏక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి మరణం బాధాకరం

బండమీది బలరాం CITU జిల్లా కార్యదర్శి

మన భారత్ ,నారాయణపేట: మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ కుమార్ ను తరగతి గదిలో గురువారం రోజు పాము కాటుకు గురై మరణించడం బాధకరమని బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పె పాఠం వింటున్న సమయంలో కిటికీ దగ్గర కుడి చేతికి పాము కాటు వేయడంతో తల్లడించిన విద్యార్థి తనను పాము కారు కరిచిందని అరవడంతో వెంటనే క్లాస్ టీచర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తీసుకొని వెళ్లినప్పటికీ ప్రాణాపాయం నుంచి బాలుని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.నారాయణపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా పాము కాటుకు గూరైనా బాలుడిని కాపాడలేక పోవడం దారణమన్నారు.

జిల్లా కేంద్రంలో ఆసుపత్రి లేకపోవడము వలన కూడా బాలుడికి సమయానికి వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

వర్షాకాలంలో పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు ఉండడం కారణంగా విషపురుగులకు ఆవాసంగా మారినప్పటికీ విద్యాధికారులు పరిశీలించకపోవడం దారుణమని విమర్శించారు.

మూడు రోజుల కిందట కోటకొండ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా పాము అగుపించిందని , వెంటనే అప్రమత్తమమైన ఆశ కార్యకర్తలు ఆ పాముని చంపేశారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు భద్రత లేకపోవడం శోచనీయమన్నారు.

పాఠశాల చుట్టూ పరిశుభ్రత ఉంచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని పాఠశాల నిధులు పక్కదారి పడుతున్న విషయాలు చాలా పాఠశాలలో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అన్ని పాఠశాలల్లో ఆసుపత్రులలో పరిశుభ్రత ఉంచే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this