e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

అనాథ బాలికలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

అనాథ బాలికలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వెళ్లి పరామర్శ.. మెరుగైన వైద్యం, చదువుకు ఆర్థిక భరోసా

మన భారత్, నేరడిగొండ:నవంబర్ 23,

తల్లిదండ్రులను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు అనాథ బాలికలకు బోథ్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు అండగా నిలిచారు. ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న బాలికల పరిస్థితిని తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని నేరడిగొండ మండలం గుత్పాల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏసుగూడ గ్రామానికి చెందిన నాగమణి, ఆమె అక్క జల్దేవి తల్లిదండ్రులను కోల్పోయి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాథోడ్ బాపురావు గతంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న నాగమణిని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇంటికి వెళ్లి పరామర్శ

గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ఏసుగూడ గ్రామంలోని బాలికల నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు అక్కాచెల్లెళ్లను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నాగమణి ఆరోగ్య పరిస్థితిని, కాలికి ఉన్న గాయాన్ని పరిశీలించి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బాలికలు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు.

చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచన

అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నాగమణి, జల్దేవికి సూచించారు. వారి విద్యాభ్యాసానికి, భవిష్యత్తుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

తల్లిదండ్రులను కోల్పోయి కష్టాల్లో ఉన్న బాలికలకు ఆపన్నహస్తం అందించడంతో పాటు, వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు, రఘునాథ్, రాజేశ్వర్, అయూబ్ ఖాన్, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE