హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Published on

-Advertisement-

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ డిమాండ్

మన భారత్, నారాయణపేట: 
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట పట్టణంలో బజార్ హామాలీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న కేంద్ర రాష్ట్ర కార్మిక ,రైతు కూలీల సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నారాయణపేట పట్టణంలో హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నారని, కార్మిక హక్కులు కాలరాసేందుకే నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
సంపద సృష్టికర్తలు కార్మికులు కాగా దానికి విరుద్ధంగా కార్పొరేట్ శక్తులే దేశ సంపద సృష్టికర్తలని మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం విడ్డూరమన్నారు.

వి బి జి రాంజీ చట్టాన్ని తెచ్చి ఉపాధి కూలీలకు ద్రోహం తల పెట్టారని, రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర చట్టం తీసుకురాకుండా అన్నదాతను నిండా ముంచుతున్నారని విమర్శించారు .

కార్మిక, రైతు, కూలీల హక్కుల కోసం జరిగే పోరాటంలో హామాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పట్టణం లో సిమెంట్ ఎరువులు దుకాణాల యజమానిలకు ఆగస్ట్ 10 నా పనిలోకి రాలేమని వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నరహరి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్, హామాలి యూనియన్ నాయకులు ఆశప్ప, యేసురత్నం, హనుమంతు తదితరులు పాల్గొన్నారు

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this