ఘనంగా రిజర్వేషన్ డే.!

Published on

-Advertisement-

రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ కి ఘన వివాళి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్

మన భారత్, నారాయణపేట: భారత దేశంలో సామాజిక న్యాయానికి ప్రతీక రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ గారికి “రిజర్వేషన్ డే” సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో సామాజిక న్యాయం,సమాన అవకాశాలు ఉండే విధంగా 1902 జూలై 26న రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసిన తొలి పాలకుడు సాహు మహరాజ్ అన్నారు.నాటి మనువాదుల కుట్రలకు బలైన బహుజన సమాజానికి విద్యా,ఉద్యోగ రంగాలలో సమాన హక్కులు,ఆత్మ గౌరవం,సమాన అవకాశాలు కల్పించి తన రాజనీతిని చాటిన మహనీయుడు సాహు మహరాజ్ అని కొనియాడారు.

ఛత్రపతి సాహు మహాజ్  అమలు చేసిన సామాజిక న్యాయం భారత రాజ్యాంగం రూపంలో మనకు హక్కుగా ఉన్నప్పటికీ మనువాద,ఆధిపత్య వర్గాల దోపిడి దారులు బహుజన సమాజానికి సామాజిక,విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాల దక్కకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.దేశంలో,బహుజన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు,ఆత్మ గౌరవం బీఎస్పీ మాత్రమే ఇస్తుందని,బహుజన వర్గాల ప్రజలందరూ సాహు మహరాజ్ గారి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య,అసెంబ్లీ అధ్యక్షులు దాసరి అశోక్,బీఎస్పీ నాయకులు అజయ్ కుమార్,రాజు,రమేష్,నరసింహా, వెంకటయ్య ముదిరాజ్,ప్రకాష్ నాయక్,వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this