రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని రైతు ఆమరణ దీక్ష..!

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్):

రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో చెల్లింపు, పంట బీమా అమలు వంటి డిమాండ్లతో తలమడుగు మండలానికి చెందిన రైతు కె. కిషోర్ రావు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆమరణ దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా కిషోర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు కూడా సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి, రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని, కానీ సమయానికి ఆర్థిక సహాయం అందకపోవడంతో ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందని, ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పంట బీమా (పసల్ బీమా) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రైతుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని కిషోర్ రావు హెచ్చరించారు.

ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this