e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం..

ఈ నెల 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం
– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 24, మన భారత్ :
వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను ఈ నెల 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం తెలిపింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బాధితుల కోసం కరీంనగర్ లో ఈ ప్రక్రియ జరగనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నేర పరిశోధన విభాగం ఆధ్వర్యంలో బాధితులకు త్వరితగతిన న్యాయం, ఉపశమనం కల్పించే లక్ష్యంతో నిర్దేశిత కేంద్రాలలో పని దినాలలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి కాలనీ, కరీంనగర్ – సిరిసిల్ల బైపాస్ రోడ్డు, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గల సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (CTC) లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ షెడ్యూల్ ప్రకారం జగిత్యాల జిల్లాకి సంబంధించిన మండలాలు నవంబర్ 25న బీర్పూర్, నవంబర్ 26న ధర్మపురి, నవంబర్ 27న ధర్మపురి, ఎండపల్లి, నవంబర్ 28న ఎండపల్లి, గొల్లపల్లి; నవంబర్ 30న గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల ఖాతాలను పరిశీలిస్తారు. డిసెంబర్ నెలలో భాగంగా డిసెంబర్ 1న ఇబ్రహీంపట్నం, కథలాపూర్; డిసెంబర్ 2న కథలాపూర్, కోరుట్ల; డిసెంబర్ 3న కోరుట్ల, మల్యాల; డిసెంబర్ 4న మల్యాల, మల్లాపూర్; డిసెంబర్ 5న మల్లాపూర్, మేడిపల్లి, డిసెంబర్ 7న మేడిపల్లి, మెట్‌పల్లి; డిసెంబర్ 8న మెట్‌పల్లి, పెగడపల్లి, డిసెంబర్ 9న పెగడపల్లి, సారంగాపూర్, డిసెంబర్ 10న సారంగాపూర్, వెల్గటూర్, డిసెంబర్ 11న వెల్గటూర్ డిపాజిటర్లు తమ మండల తేదీలను కేంద్రం వద్ద ముందుగా నిర్ధారించుకొని మీ యొక్క సమీప పోలీస్ స్టేషన్ లో తెలియపరిస్తే వారిని కరీంనగర్ లో గల సిటిసి కేంద్రానికి పోలీస్ శాఖ వారి తీసుకెళ్లడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

ధృవీకరణ కోసం వచ్చే వారు అసలు (ఒరిజినల్) బాండ్లను కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, వాటిని అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని సీపీ స్పష్టం చేశారు. డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే అసలు బాండ్/రసీదుతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్, పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, తెలిస్తే ఏజెంట్ వివరాలు సమర్పించాలి. డిపాజిటర్ మరణించి నామినీ జీవించి ఉంటే నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఆధార్, పాన్, రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో మరియు బ్యాంక్ లింక్డ్ మొబైల్ నంబర్ తీసుకురావాలి. డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించినట్లయితే చట్టబద్ధ వారసుడు సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు (అసలు, జిరాక్స్), వారసుని ఆధార్, పాన్, చట్టబద్ధ వారసుల/కుటుంబ ధృవీకరణ పత్రం (అసలు, జిరాక్స్), బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్ సమర్పించాలి.

డిపాజిటర్ జీవించి ఉండి స్వయంగా రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు డిపాజిటర్ అసలు బాండ్, సంతకం చేసిన కలర్ జిరాక్స్, డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో పాటు డిపాజిటర్ నుండి అధీకృత లేఖ (ఆథరైజేషన్ లెటర్), హాజరయ్యే కుటుంబ సభ్యుని గుర్తింపు పత్రం మరియు కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం తీసుకురావాలని తెలిపారు. ఏజెంట్ల ద్వారా సమర్పించే వారు ప్రతి అసలు బాండ్, కలర్ జిరాక్స్ చూపించి ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలని, తమ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్ మరియు తప్పనిసరిగా ఏజెంట్ కోడ్ సమర్పించాలని సూచించారు.

పత్రాల పరిశీలన అనంతరం అధికారులు రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) అందజేస్తారని, ఏజెంట్ వివరాలు తెలియని పక్షంలో దరఖాస్తు ఫారమ్‌లో ‘తెలియదు/అందుబాటులో లేదు’ అని పేర్కొనవచ్చని తెలిపారు.

మార్గం ఆదిత్య, మన భారత్, జర్నలిస్టు, జగిత్యాల జిల్లా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE