e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు..

కార్తీక పౌర్ణమి, గిరిప్రదక్షిణ, స్వామివారి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
జగిత్యాల/, కొండగట్టు, నవంబర్ 24, మన భారత్ :
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం అత్యంత విశేషమైన పర్వదినం సందర్భంగా భక్తజన సందోహం నెలకొంది. కార్తీక పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరిప్రదక్షిణ, మంగళవారం, గురునానక్ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం కావడం, అదేవిధంగా స్వామివారి నిజరూప దర్శనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు తరలివచ్చారు. ఈ ప్రత్యేక సందర్భాలన్నీ ఒకేరోజు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

సుమారు లక్ష పైగా మంది వరకు భక్తులు కొండగట్టుకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ. అదేవిధంగా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకురావడం జరిగింది. ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవస్థాన అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను పూర్ణకుంభంతో సాదరంగా స్వీకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మార్గం ఆదిత్య, మన భారత్, జర్నలిస్టు జగిత్యాల జిల్లా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE