e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌడాల సంతోష్

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంతోష్

తాంసి:మన భారత్, ఆగస్టు 23, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాంసి మండలాధ్యక్షుడు సంతోష్ కోరారు. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కప్పర్ల గ్రామంలో అర్హత కలిగిన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అర్హులైన కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై అవగాహన కల్పించేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంతోష్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులను పొందిన లబ్ధిదారులు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కప్పర్ల గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, ఆత్మ చైర్మన్ నారాయణ, సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE