e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 15,జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జాయింట్ కలెక్టర్ చిత్రు, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌లతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, బతుకమ్మలను చుట్టూ తిరుగుతూ వేడుకలను సందడిగా నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. అధికారులు, ఉద్యోగులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, డీఆర్వో స్రవంతి, ఏవో వర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌తో పాటు తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE