e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

రాంనగర్‌లో 10, 11వార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఆదిలాబాద్: మన భారత్, ఆగస్టు,23 ఆదిలాబాద్ రాంనగర్ ప్రాంతంలో 10వ, 11వ వార్డులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం రేషన్ షాప్‌లో నిర్వహించారు. అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.

కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తీగల అంజలి–అనిల్ దంపతుల చేతుల మీదుగా రాంపెళ్లి శ్వేత–సతీష్ యాదవ్ దంపతులు తమ స్మార్ట్ రేషన్ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రేషన్ కార్డుల ద్వారా లభించే ప్రయోజనాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాంనగర్‌లోని 10వ, 11వ వార్డులకు చెందిన లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు స్మార్ట్ రేషన్ కార్డులు అందడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తీగల అంజలి–అనిల్, 10వ వార్డు కౌన్సిలర్, రాంపెళ్లి శ్వేత–సతీష్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, నవీన్, షాప్ప మరప రాజు, అభిలాష్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE