బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

Published on

-Advertisement-

మన భారత్, బేల :

బేల మండలంలోని దేవుజీగూడ గ్రామంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాన్ని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పరామర్శించారు. కుడుమేతే బండు నివాసంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వస్వం కోల్పోయింది.

సంఘటన విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఘటనపై వివరాలు తెలుసుకుని వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాజిద్ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ అగ్ని ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, వంట సామాగ్రి, కొంత నగదు, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. మొత్తం సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని సామ రూపేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడావి చంద్రకాంత్, సర్పంచ్‌లు కుడుమేత శత్రుగన్, మడావి బాపూరావు, ఉప సర్పంచ్ విట్టల్ రావూత్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...