బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
మన భారత్, బేల : బేల మండలంలోని దేవుజీగూడ గ్రామంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాన్ని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పరామర్శించారు. కుడుమేతే బండు నివాసంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వస్వం కోల్పోయింది. సంఘటన విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు....