బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంద్రాల నగేష్ ఐదవ సారి ఎన్నిక కావడం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఆయన కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి రాకేష్, బోండ్ల వెంకటస్వామి శాలువాతో నగేష్ గారిని సత్కరించి అభినందనలు తెలిపారు.

ఎంద్రాల నగేష్ వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనపై న్యాయవాదుల విశ్వాసానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం, బార్ అసోసియేషన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎంద్రాల నగేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this