e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

సామరస్యానికి ప్రతీకగా కాంగ్రెస్ ఇఫ్తార్..

మన భారత్,ఆదిలాబాద్:

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.

ఈ ఇఫ్తార్ విందులో బోత్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా డా. నరేష్ జాదవ్ ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైనదని, ఈ కాలంలో వారు అల్లా పట్ల భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారని తెలిపారు. వారి ప్రార్థనలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

రంజాన్ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొంటూ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మత సామరస్యాన్ని మరింత బలపరిచే సందేశం సమాజానికి అందిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, ఎంఐఎం అధ్యక్షుడు నజీర్, బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మొత్తంగా ఈ ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ ఆదిలాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE