రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన

Published on

-Advertisement-

మన భారత్ , ఆదిలాబాద్:

జిల్లా పల్లీకే గ్రామంలో బీసీఐ (Better Cotton Initiative) కేశవపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు బయో ఇన్‌పుట్ సెంటర్ (BIC) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు సుస్థిర వ్యవసాయం పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించారు.

సమావేశంలో బీసీఐ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యాలను వివరించిన ప్రతినిధులు, పత్తి పంటలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ విధానాలను పాటించడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. సుస్థిర వ్యవసాయం (Sustainable Agriculture) విధానాలు పర్యావరణానికి మేలు చేయడంతో పాటు భూమి సారాన్ని కాపాడతాయని పేర్కొన్నారు.

బయో ఇన్‌పుట్ సెంటర్ (BIC) ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రామ స్థాయిలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులు, కీటకనాశక ద్రావణాలను స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా రైతులకు జీవామృతం, ఘన జీవామృతం, నేమ్ కషాయం, దశపర్ణి కషాయం వంటి సేంద్రియ ద్రావణాల తయారీ విధానాన్ని ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా పంట నాణ్యత మెరుగుపడటంతో పాటు భూమి ఆరోగ్యం కాపాడబడుతుందని చెప్పారు.

కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రాజేందర్ స్వామి, గ్రామస్థులు, SHG సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు ఈ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి శిక్షణలు తరచుగా నిర్వహించాలని కోరారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this