e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

లత ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన మచిలీపట్నం సుధా గోల్డ్ కవరింగ్ కంపెనీని సందర్శించిన చిట్యాల మండల మహిళలు

మన భారత్ చిట్యాల: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, నాబార్డ్ (NABARD) సహకారంతో ప్రత్యేక ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. కృత్రిమ ఆభరణాల తయారీపై లైవ్లీహుడ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చిట్యాల మండలానికి చెందిన 45 మంది మహిళలు ఈ పర్యటనలో పాల్గొన్నారు.నవంబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న సుధా గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీస్‌ను మహిళలు సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాల తయారీ విధానం, డిజైన్ల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అవగాహన పొందారు.ఈ ఎక్స్‌పోజర్ విజిట్‌ను లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి లతా ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా మహిళలకు మరింత ప్రోత్సాహం లభించింది. ఆభరణాల తయారీ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తులో సొంతంగా చిన్న పరిశ్రమలు లేదా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ పర్యటన దోహదపడనుంది.మహిళలు కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, నేర్చుకున్న నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.నాబార్డ్ సహకారంతో, సొసైటీ ఫర్ లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ (రిజిస్ట్రేషన్ నం. 444/2011) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం చిట్యాల మండల మహిళలకు స్వయం ఉపాధి దిశగా మంచి అవకాశంగా నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE