e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

మన్కాపూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు..

మన్కాపూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు

గ్రామాభివృద్ధికి అండగా ఉంటా.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

మన భారత్, ఇచ్చోడ:నవంబర్ 28,

గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలంలోని మన్కాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.

గ్రామ పటేల్ మెస్రం వసంత్ రావు, మహాజన్ కొడపా సంతోష్, దేవారి మెస్రం సురేష్, షర్మిడి మెస్రం శంబు, పెందురు జంగు తదితరుల ఆహ్వానం మేరకు రాథోడ్ బాపురావు మన్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొమరం భీమ్‌కు ఘన నివాళులు

ఈ సందర్భంగా ముందుగా గిరిజనుల ఆరాధ్య వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి రాథోడ్ బాపురావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన కొమరం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం గ్రామంలోని నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం

అనంతరం నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీకి లభిస్తున్న ఆదరణ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మన్కాపూర్‌లో యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల కన్వీనర్ షేక్ బిలాల్, సిరికొండ, నేరడిగొండ మండల కన్వీనర్లు, సతీష్, బానోత్ వసంత్ రావు, మైనార్టీ చైర్మన్ షేక్ ఫారిద్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మన్కాపూర్ గ్రామ పటేల్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE