e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!

గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!

ప్రభుత్వ ట్రెజరీ ఖాతా విధానానికి స్వస్తి.. అక్టోబర్ 9 నుంచే కొత్త విధానం అమలు

మన భారత్, హైదరాబాద్:నవంబర్ 6,

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ పంచాయతీలు తమ సొంతంగా సమకూర్చుకునే ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా నేరుగా ఆయా గ్రామ పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నూతన విధానం అక్టోబర్ 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు పన్నులు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకున్న సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వచ్చేది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, తాగునీటి సరఫరా, చిన్నచిన్న మరమ్మతులు, అభివృద్ధి పనులు తదితర అవసరాల కోసం నిధులు ఖర్చు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు, నిధుల విడుదలపై ఆధారపడాల్సి వచ్చేది.

దీంతో పలు సందర్భాల్లో బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడం, అత్యవసర పనులకు నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులపై ఈ జాప్యం ప్రభావం చూపేది.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామ పంచాయతీల సొంత ఆదాయం నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దీంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకునే అవకాశం కలగనుంది. అత్యవసర పనులకు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గడంతో పాటు గ్రామస్థాయి పాలనలో ఆర్థిక వెసులుబాటు పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు దోహదపడనుంది. అయితే నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత పంచాయతీ పాలకవర్గాలు, అధికారులపై ఉండనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE