e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

కుంటలో యువకుడి మృతదేహం లభ్యం..

ఇంటి నుంచి వెళ్లిన యువకుడు తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని ఓ కుంటలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడిని ఆదిలాబాద్ పట్టణంలోని శంకర్ గుట్టకు చెందిన సాయికుమార్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కజ్జర్ల గ్రామ శివారులోని ఓ కుంటలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఆశన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తలమడుగు ఎస్సై రాధిక తెలిపారు.

యువకుడి మృతికి గల కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొనగా, స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE