e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కేటీఆర్ పర్యటన రైతు కుటుంబాల పరామర్శ..

నవంబర్ 1న కేటీఆర్ తలమడుగు పర్యటన
రైతు కుటుంబాల పరామర్శ అనంతరం ప్రెస్‌మీట్‌.. ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 30, ఇటీవల తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, వారి కుటుంబాలను పరామర్శించేందుకు నవంబర్ 1వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలమడుగు మండల కేంద్రానికి రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండల కేంద్రంలో పర్యటించారు.

కేటీఆర్ రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రెస్‌మీట్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, స్థల అనుకూలత తదితర అంశాలను నాయకులతో చర్చించారు.

రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి పార్టీ తరఫున భరోసా కల్పించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పర్యటన ద్వారా వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 1న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE