e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

అంబుగాంలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమం.. సామూహిక సత్యనారాయణ వ్రతాలు

మన భారత్, తాంసి: నవంబర్ 21, తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు గంగాధర్, సుధాకర్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా హనుమాన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తిపూర్వక వాతావరణం నెలకొంది.

అనంతరం గ్రామ ప్రజల భాగస్వామ్యంతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. కుటుంబాల సుఖసంతోషాలు, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, గ్రామాభివృద్ధి కోసం భక్తులు స్వామివారిని ప్రార్థించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూర్పాబాయి, ఉప సర్పంచ్ భరత్, పటేల్, మహాజన్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థుల సహకారంతో హనుమాన్ ఆలయ వార్షికోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE