e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

సుంకిడిలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో..

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. సుంకిడిలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మండలాన్ని మినహాయించడంపై అభ్యంతరం.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని సుంకిడి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని గుర్తించిన అధికారులు తలమడుగు మండలాన్ని మాత్రం ఆ జాబితాలో చేర్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల మండలాలను ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినప్పుడు తలమడుగును ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.

తలమడుగు మండలంలో సాగునీటి ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, ఇతర నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రధానంగా వర్షాధారంగానే వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల దిగుబడులు తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు.

మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించకపోవడానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంగ్రెస్ నాయకుల రాజకీయ జోక్యం కూడా కారణమని తోట వెంకటేష్ ఆరోపించారు. రైతుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అందాల్సిన కరువు సహాయ చర్యలు, ప్రభుత్వ ప్రయోజనాలు వెంటనే కల్పించాలని కోరారు.

ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, యువ నాయకుడు అభిరామిరెడ్డి, జిల్లా నాయకులు కేదేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దేవాపూర్ మాజీ సర్పంచ్ అబ్దుల్లా, సర్పంచులు లక్ష్మారెడ్డి, ప్రకాష్, చల్లపల్లి సర్పంచ్ అశోక్, కుచులాపూర్ ఉపసర్పంచ్ దీపక్, సర్పంచ్ చంటి, మాజీ సర్పంచ్ నరసింహులు, మహేష్ దేశ్‌ముఖ్, జావిద్ ఖాన్, ఉపసర్పంచ్ అజయ్, తోట శ్రీనివాస్, మహిళా నాయకురాళ్లు పల్లవి, రంబాయి, సునీత రెడ్డి, రాగి కిషన్, తోట ప్రమోద్, సంతోష్, సుదర్శన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రవీణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE