e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

పశువుల సంత అంగడి పునఃప్రారంభం..

సుంకిడిలో పశువుల సంత అంగడి పునఃప్రారంభం

మన భారత్, తలమడుగు: నవంబర్ 22, మండలంలోని సుంకిడి గ్రామంలో పశువుల సంత అంగడిని నేడు పునఃప్రారంభించారు. గ్రామీణ ప్రాంత రైతులకు, పశుపోషకులకు ఉపయోగకరంగా ఉండేలా పశువుల సంత అంగడిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామంలో రైతులు, పశుపోషకులు హర్షం వ్యక్తం చేశారు.

గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పశువుల సంత అంగడి తిరిగి ప్రారంభం కావడంతో పరిసర గ్రామాల రైతులకు కూడా పశువుల కొనుగోలు, విక్రయాలకు అవకాశం కలగనుంది. పశువుల క్రయవిక్రయాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు పెరిగేందుకు దోహదపడనుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన పునఃప్రారంభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE