e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 27 మన భారత్ ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బాకురుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన షూ లను స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయశ్రీ భాగ్యరాజ్, ఉప సర్పంచ్ రవీందర్ గుప్తా, వార్డు సభ్యుడు జంగాల రాజు, పంచాయతీ కార్యదర్శి పవిత్ర, తండా సర్పంచ్ అజ్మీరా రాజు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, ఉపాధ్యాయులు మహిపాల్ పాల్గొని విద్యార్థులకు షూలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యను మరింత ప్రోత్సహించవచ్చని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సత్తయ్య, మహేందర్, శ్రీశైలం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE