e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

పోలీస్ విధులపై విద్యార్థులకు అవగాహన..

పోలీస్ స్టేషన్ల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అవగాహన

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 27: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సందర్శించారు. విద్యార్థులతో మమేకమైన ఆయన పోలీసు వ్యవస్థ పనితీరు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వినియోగించే పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను వివరించారు.

వేలిముద్రల గుర్తింపుపై ప్రత్యక్ష వివరణ

నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగించే వేలిముద్రల గుర్తింపు, సేకరణ విధానంపై ఎస్పీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేరాలను ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు. పోలీస్ శాఖలో సమాచార మార్పిడి, అత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయం ఎలా జరుగుతుందో విద్యార్థులకు తెలియజేశారు.

పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే పరికరాలను విద్యార్థులు దగ్గరగా పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు తదితర ప్రక్రియలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పోలీసులంటే భయం కాకుండా గౌరవం ఉండాలి

పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ఆపద సమయాల్లో ప్రజలు పోలీసులను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణ కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడానికి గల నేపథ్యం, దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణం వెనుక గతంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు.

అన్ని పోలీస్ స్టేషన్లలో విద్యార్థుల సందర్శన

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పోలీస్ స్టేషన్ల నిర్వహణ, పోలీసుల విధులు, నేర పరిశోధన పద్ధతులు, సాంకేతిక వ్యవస్థలపై పలు అంశాలను తెలుసుకున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు పాల్గొని పోలీసు సేవలు, అమరవీరుల త్యాగాల గురించి తెలుసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్‌ఐలు అశోక్, నాగనాథ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE