e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది..

నూతన చేయూత పింఛన్లను పంపిణీ చేసిన అధికారులు.

అర్హత ఉన్నవారు పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలి.

డి ఆర్ డి ఓ లక్ష్మీనారాయణ.

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 17 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నూతన చేయూత పెన్షన్లు మంజూరు కాగా మంగళవారం సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు చేయూత పెన్షన్లను, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేసిన అధికారులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఆర్ డి ఒ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ నూతన చేయుత పింఛన్లను అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలానికి మొత్తం 563 నూతన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో వితంతు పింఛన్లు 255, ఒంటరి మహిళలు29, వికలాంగుల పింఛన్లు161,చేనేత 6,కల్లుగీత కార్మికులు112 మందికి పింఛన్లు మంజూరైనట్టు తెలిపారు.. అలాగే మండలంలో 67 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా అట్టి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వమని నిరుపేదలకు అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అటు అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారని అన్నారు.. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పింఛన్లను దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. అనంతరం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నారని ఎల్లారెడ్డిపేట మండలానికి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దివ్య జ్యోతి, ఎంపీడీవో సత్తయ్య, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం, వైస్ చైర్మన్ నంది కిషన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, సర్పంచులు కొండ రమేష్ గౌడ్, ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, సోమారపు శరవిందు, మదాసు స్రవంతి బాబు, బోనాల మణెమ్మ, చిర్రం నాగరాజు యాదవ్, నెత్తెట్ల లక్ష్మయ్య యాదవ్, మేడిపల్లి జ్యోతి, అందే సుభాష్, ఎలగందుల నరసింహులు, అజ్మీర తిరుపతి నాయక్, ముత్యాల ప్రమీల బాలరాజు , బాపు రెడ్డి, వెంకట్ రెడ్డి, సరోజ చంద్రు నాయక్, ధరావత్ నిర్మల సురేష్ నాయక్, సుజాత కళ్యాణ్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ బాయ్,సద్ది లక్ష్మారెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE