e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఓటరు హక్కుల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి..

“ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల పిలుపు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 27: ఓటరు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటం, ఓటరు జాబితాల్లో పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంచవటి హోటల్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్, కార్యక్రమ కోఆర్డినేటర్ శ్రావణ రావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎస్ఐఆర్ (SIR) అబ్జర్వర్ కొట్నాక్ తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన హక్కు అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత విధానాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

SIR ప్రక్రియపై ప్రత్యేక దృష్టి

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు అనవసరంగా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏ-2లు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొనే వారికి అవసరమైన సహకారం అందించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో ఓటరు జాబితాలను పరిశీలిస్తూ అర్హులైన ఓటర్ల వివరాలను ధ్రువీకరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు హక్కులకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పలువురు కాంగ్రెస్ నేతల హాజరు

సమావేశంలో బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, మాజీ డీసీసీబీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, మడుపు దామోదర్ రెడ్డి, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్, ఇచ్చోడ ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, బోథ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పసుల చంటి, ఆదిలాబాద్ నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కంది సాయి మౌనరెడ్డి, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు గుడిపల్లి నగేష్, సామా రూపేష్ రెడ్డి, INTUC జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జ్ గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేటర్ డేరా కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సంజయ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE