e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

మహిళపై లైంగిక వేధింపులు.. నిందితుడికి రిమాండ్

 

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వీర్నపల్లి పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వీర్నపల్లి సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు భూక్య నవీన్‌ను అదుపులోకి తీసుకుని, అవసరమైన ఆధారాలను సేకరించారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి నిందితుడిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు, లైంగిక వేధింపులు లేదా ఇతర నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే భయాందోళనలకు గురికాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు.

మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE