e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

1600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి..

సింగసముద్రం,జక్కుల చెరువుల నుంచి సాగునీరు విడుదల చేయాలి.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వినతి.

మన భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాలకు జీవనాధారంగా ఉన్న సింగసముద్రం, జక్కుల చెరువుల నుంచి పంటల సాగు కోసం నీటిని విడుదల చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, స్థానిక తహసీల్దార్ దివ్యజ్యోతికి ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్, కోరుట్లపేట, నారాయణపూర్, సర్వేపల్లి, గొల్లపల్లి తదితర గ్రామాల్లో సుమారు 1600 ఎకరాల ఆయకట్టుకు సింగసముద్రం ప్రధాన జీవనాధారమని వారు పేర్కొన్నారు. చెరువుల నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.సింగసముద్రం, జక్కుల చెరువుల నుంచి సాగునీటి విడుదలతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నంది కిషన్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ భాయి, ఏఎంసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, సింగసముద్రం మాజీ నీటి సంఘం అధ్యక్షుడు నేవూరి రవీందర్ రెడ్డి, సర్పంచ్ బాపురెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి బాల్రెడ్డి, డైరెక్టర్ రాజు, మాజీ డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్, కస్తూరి ప్రవీణ్ రెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ ఒగ్గు మహేష్ చంద్ర రాజన్న,మన భారత్ సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE