e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

సీఐ శ్రీనివాస్‌కు ఘన సన్మానం..

వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించిన సీఐ శ్రీనివాస్‌కు సన్మానం.

వృద్ధ దంపతుల పోషణపై కుమారులు, కోడళ్లకు కౌన్సెలింగ్‌.

వయోవృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్‌ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నాయకులు ఘనంగా సన్మానించారు.

మన భారత్, సిరిసిల్ల పట్టణానికి చెందిన వృద్ధ దంపతుల పోషణకు సంబంధించి వారి కుమారులు, కోడళ్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాస్ వృద్ధ దంపతుల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. కుమారులు, కోడళ్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. వృద్ధ దంపతులను సక్రమంగా పోషించి, వారికి అవసరమైన ఆదరణ అందిస్తామని కుటుంబ సభ్యుల నుంచి హామీ తీసుకున్నారు.

వృద్ధుల సమస్యపై స్పందించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న సీఐ శ్రీనివాస్ సేవలను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా సీఐని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తీపి తినిపించి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, ఉపాధ్యక్షులు ఎనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు, గౌరవ సభ్యులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వయోవృద్ధులు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఇదే విధంగా స్పందించి, వారికి అండగా నిలవాలని సీఐ శ్రీనివాస్‌ను అసోసియేషన్ నాయకులు కోరారు.

మీ ఒగ్గు మహేష్ చంద్ర రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE