e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

జోగిపేట హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్..

సిరిసిల్లలో బిఆర్ఎస్ వీ నాయకుల నిరసన

జోగిపేట హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్..

విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన

బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం.

సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు.

సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన హాస్టళ్లు వారి ఆరోగ్యానికి ముప్పుగా మారడం ఆందోళనకరమన్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాటం చేస్తుందని కంచర్ల రవి గౌడ్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో నాయకులు. మట్టి శ్రీనివాస్, బల్యాల ప్రవీణ్, లింగంపల్లి అబ్బి, ప్రవీణ్,కంబోజి హర్షిత్, రిషి కుమార్, సంజయ్, వివేక్, మహేష్, యశ్వంత్, హర్షిత్, నిశాంత్, యశ్వంత్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE