e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

పోషణ అభియాన్‌తో ఆరోగ్యంపై అవగాహన

బొప్పాపూర్ లో పోషణ అభియాన్‌తో ఆరోగ్యంపై అవగాహన

పాల్గొన్న సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి.

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ అనూష, అంగన్వాడీ సూపర్వైజర్ బి. రేణుక, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అంగన్వాడీ సిబ్బంది సూచించారు.గ్రామస్థాయిలో పోషణ అభియాన్ కార్యక్రమాల ద్వారా తల్లులు, పిల్లల్లో పోషకాహారంపై అవగాహన పెంచడం అభినందనీయమని సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE