వైభవంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బంజారా సంప్రదాయాల ప్రకారం మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనికలతో కలిసి భోగ్ సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమాజం కొరకు ప్రతీ ఒక్కరు సమయం కేటాయించాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆచరణలు సమాజాభివృద్ధికి దారితీసే మార్గదర్శకాలని పేర్కొన్నారు. సమాజం పురోగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సమయాన్ని కేటాయించాలని పిలుపునిచ్చారు.

బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా కొనసాగాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this