వైభవంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు..
మన భారత్, ఆదిలాబాద్: బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారా సంప్రదాయాల ప్రకారం మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనికలతో కలిసి భోగ్ సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో...