సర్పంచ్ పొరండ్ల సంతోష్ ను సన్మానించిన ఎంపీ..

Published on

-Advertisement-

ఎంపీ గోడం నగేష్ నివాసంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్‌కు ఘన సన్మానం

మన భారత్ / తలమడుగు : ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నివాసంలో దేవాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోరండ్ల సంతోష్ కి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు, ప్రజలకు అందిస్తున్న నాయకత్వాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలే గ్రామీణ అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేవాపూర్ గ్రామంలో సర్పంచ్ గా గెలవడం అభినందనీయమని సర్పంచ్ పోరండ్ల సంతోష్‌ను ప్రశంసించారు.

సన్మానాన్ని స్వీకరించిన అనంతరం సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ.. తనను సన్మానించిన ఎంపీ గోడం నగేష్‌కు, కార్యక్రమానికి హాజరైన నాయకులు, గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహాకారంతో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కనపర్తి చంద్రకాంత్, దశరథ్ పటేల్, బీజేవైఎం అధ్యక్షులు దాతజీ కిరణ్, గంధం నరేష్, శానం శ్రీనివాస్, బోండ్ల వెంకటస్వామి, పూలవేణి గణేష్, రేగుల మోహన్, చింతల రాజు, సంగర్తి శ్రీనివాస్, పోతుగంటి అశోక్, ఆడెపు శ్రీనివాస్, సీపాతి నగేష్, అనుప ఆశన్న, ఓసా రవి, పోరండ్ల రాములు, చల్ల విజయ్ రెడ్డి, లస్మ రెడ్డి, జ్ఞానేశ్వర్‌తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు

 అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. ఉత్తర కోస్తాపై డీప్‌ డిప్రెషన్‌ ప్రభావం మన భారత్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ...

More like this