మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ చేయూత..

Published on

-Advertisement-

చలి బాధితులకు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ చేయూత

-పిప్పల్‌దరి, అర్లీ(బి) గ్రామాల్లో దుప్పట్ల పంపిణీ

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పిప్పల్‌దరి, అర్లీ(బి) గ్రామాల్లో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న నాయకత్వం వహించారు.

పిప్పల్‌దరి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు బోనగిరి నారాయణ, ప్రధాన కార్యదర్శి రాసం శ్రీనివాస్, కరమరుగుల సంటెన్న, మారిశెట్టి కిష్టయ్య, బండారి ఆడేళ్లు తదితరులు పాల్గొని గ్రామంలోని మున్నూరు కాపు కుల బంధువులకు చలి దుప్పట్లను అందజేశారు. చలి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

అదేవిధంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం అర్లీ(బి) గ్రామంలో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్నతో పాటు ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని మున్నూరు కాపు కుటుంబాలకు దుప్పట్లను అందజేసి చలికాలంలో వారికి భరోసా కల్పించారు.

సమాజంలో సేవా భావంతో ముందుకు వచ్చే ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శప్రాయమని గ్రామస్తులు ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు

 అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. ఉత్తర కోస్తాపై డీప్‌ డిప్రెషన్‌ ప్రభావం మన భారత్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

More like this