e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఎస్ఐ అంజమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన పొన్నారి గ్రామస్తులు

ఎస్ఐ అంజమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన పొన్నారి గ్రామస్తులు

తాంసి, నవంబర్ 19 (మన భారత్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తాంసి నూతన ఎస్ఐ అంజమ్మ అన్నారు. ఇటీవల తాంసి పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పొన్నారి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అంజమ్మకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా యువత తమ నడవడికను తీర్చిదిద్దుకోవాలని అన్నారు.

గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొన్నారి సర్పంచ్ భూమన్న, బీజేవైఎం మండల అధ్యక్షుడు అర్జున్, నాయకులు దిలీప్, రాకేష్, గంగన్న, సాయి, సురేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE