e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఇంటి తాళం పగలగొట్టి భారీ చోరీ.. ఒకరి అరెస్ట్

ఇంటి తాళం పగలగొట్టి భారీ చోరీ.. ఒకరి అరెస్ట్

మావల పోలీసుల అదుపులో 19 ఏళ్ల నిందితుడు.. రూ.1.10 లక్షల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు చోరీ

మన భారత్, మావల: నవంబర్ 19, ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో అదును చూసి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి నగదు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను అపహరించిన ఘటనలో మావల పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగిలించిన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంటి తాళం పగలగొట్టి బీరువా ధ్వంసం

ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన పెట్ల కృష్ణ ప్రసాద్ ఈ నెల 14వ తేదీన ఉదయం 8:30 గంటలకు వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసినట్లు గుర్తించాడు.

బీరువాలో భద్రపరిచిన రూ.1,10,000 నగదు, సుమారు 50 తులాల వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు, ఒక ఒప్పో సెల్‌ఫోన్, పవర్ బ్యాంక్‌ను దొంగలు అపహరించినట్లు బాధితుడు గుర్తించాడు. దీంతో వెంటనే మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు.. ఒకరి అరెస్ట్

బాధితుడి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు క్రైమ్ నంబర్ 771/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 331(3), 305(a) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నేరంలో పాల్గొన్న వారిలో ఒకరైన ఖమర్ బిన్ ఉమర్ అలియాస్ ఖమర్ చౌష్ (19)ను నవంబర్ 18న అదుపులోకి తీసుకున్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

మరో నిందితుడు పరారీ.. సెల్‌ఫోన్ స్వాధీనం

ఈ చోరీ ఘటనలో మరో నిందితుడైన షేక్ అమన్, విద్యానగర్, ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు చోరీ చేసిన వస్తువుల్లో ఒప్పో సెల్‌ఫోన్‌ను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు:

1. *ఖమర్ బిన్ ఉమర్ అలియాస్ ఖమర్ చౌష్ (19) తండ్రి ఉమర్ బిన్ సలాం అలియాస్ ఉమర్ చౌష్, రిక్షా కాలనీ, ఆదిలాబాద్ – అరెస్ట్.
2. షేక్ అమన్: విద్యానగర్, ఆదిలాబాద్ – పరారీలో.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఇళ్లలో ఉంచకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వారి కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణకు పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE