e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన NHM ఉద్యోగులకు భద్రతేది.?

72 క్యాటగిరీల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: ఎస్. సాయికుమార్

నవంబర్ 10: కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలందించిన నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని PDSU మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ డిమాండ్ చేశారు. NHM పరిధిలోని 72 క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి న్యాయమైన హక్కులను అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంలో NHM ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వేలాది మంది ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్నప్పటికీ వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు అందకపోవడం బాధాకరమన్నారు. నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనా, వైద్య రంగంలోని NHM ఉద్యోగులు మాత్రం తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించారని గుర్తుచేశారు. ఆసుపత్రుల్లో అటెండర్లు రోగులకు సహాయం చేయడం నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడం వరకు ప్రతి ఒక్కరూ కీలక బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యాధికారులు, డాక్టర్లు కరోనా నియంత్రణలో విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించగా, అంబులెన్స్ డ్రైవర్లు బాధితులను ఆసుపత్రులకు తరలించారని తెలిపారు. ఆశా కార్యకర్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఆరోగ్య సర్వేలు నిర్వహించి, కరోనా బాధితులను గుర్తించడంతో పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ క్రమంలో అనేకమంది ఉద్యోగులు కరోనా బారినపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కరోనా సమయంలో ఉద్యోగుల సేవలను ప్రశంసించిన ప్రభుత్వాలు, ప్రస్తుతం వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే వైద్య వ్యవస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి గౌరవం, తగిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: అన్ని కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను అర్హతలు, నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్, ఈఎస్ఐ, ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, క్యాజువల్ లీవ్స్, ఇతర సెలవులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల జోక్యాన్ని తొలగించి ఉద్యోగులను నేరుగా ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగించాలని సూచించారు.

ప్రభుత్వం 72 NHM ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని సాయికుమార్ కోరారు. ప్రస్తుతం ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పోరాటం కేవలం వేతనాల కోసం మాత్రమే కాకుండా వారి ఆత్మగౌరవం, కుటుంబాల భవిష్యత్తు, ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టత కోసం జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE